Singapur | హుజురాబాద్ రూరల్, జనవరి 1 : ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి జారీ పడిన ఓ గీత కార్మికుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం సింగాపూర్ లో చోటు చేసుకుంది. సింగాపూర్ గ్రామానికి చెందిన బుర్ర వెంకటేష్ అనే గీత కార్మికుడు వృత్తినిర్వహణలో భాగంగా తాడిచెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారీ కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు.
గమనించిన స్థానికులు వెంటనే అతడిని హుజురాబాద్ ప్రభుత్వ దవఖానకు తరలించారు. కాగా నిరుపేద కుటుంబానికి చెందిన బుర్ర వెంకటేష్ ను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, గీత కార్మికులు కోరుతున్నారు.