Electric shock | ముత్తారం, జూన్ 17: మండలంలోని ఓడేడు గ్రామానికి చెందిన అల్లాడి రవీందర్ రావుకు చెందిన పాడి గేదే విద్యుత్ షాక్ తో మృతి చెందింది. గ్రామానికి చెందిన పశువుల కాపరి ఓడేడ్ మానేరు అవతల ఒడ్డున పశువులను మేత మేపుతుండగా అక్కడ ఉన్న విద్యుత్ మోటర్ వైర్లకు తగలడంతో గేదే అక్కడికక్కడే మృతి చెందిందని బాధితుడు అల్లాడి రవీందర్ రావు తెలిపారు. చనిపోయిన గేదే విలువ రూ.60వేలు ఉంటుందని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వేడుకున్నాడు.