Venkateshwara Swamy | గంగాధర, మార్చి9 : గంగాధర మండలం గర్షకుర్తి వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను ఈనెల 9వ తేదీ నుండి ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కల్వకోట శ్రీనివాసరావు తెలిపారు. 9న స్వామివారి ఆలయ ప్రవేశం, 10న పుణ్యవచనం, ఎదుర్కోలు, గరుడముద్దలు, స్వామివారి కల్యాణోత్సవం, 11న హవనం, బేరి పూజ, మాతృశ్రీ భజన మండలి ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనలు, 12న వేముల వాడ వేద బ్రాహ్మణులు, శ్రీ భాష్యం శ్రీనివాసచారి బృందం చే సదస్యం వేదగోష్టి, 13న హనుమత్ వాహనంపై డోలోత్సవం, ప్రముఖ హరికథ కళాకారుని వావిలాల నాగరాణి భాగవతారిని హరికథ, 14న బండ్లు తిరుగుట, శేష వాహనంపై డోలోత్సవం, 15న స్వామివారి రథోత్సవం, పూర్ణాహుతి, పుష్పయాగం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంగాధర మండలంతో పాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.