Gangadhara | వ్యాసరచన పోటీల్లో గంగాధర విద్యార్థుల ప్రతిభ
రోడ్డు భద్రతలో భాగంగా గంగాధర పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు శ్రీజ వ్యాసరచన, వర్షిత్ చిత్రలేఖనంలో ప్రతిభ కనబరచగా కరీంనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చేతుల బహుమతులు అందుకున్నారు.
Gangadhara | గంగాధర, ఏప్రిల్ 17 : రోడ్డు భద్రతలో భాగంగా గంగాధర పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు శ్రీజ వ్యాసరచన, వర్షిత్ చిత్రలేఖనంలో ప్రతిభ కనబరచగా కరీంనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చేతుల బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలను పాటించడంలో రోల్ మోడల్‌గా నిలవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
ట్రాఫిక్ సిగ్నల్స్, హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నివారించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రాణాలు చాలా విలువైనవని, ‘అరైవ్ అలైవ్’ (సురక్షితంగా చేరుకుందాం) అనే నినాదంతో రోడ్డు క్రమశిక్షణను పాటించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ పర్రెం లక్ష్మారెడ్డి, డైరెక్టర్ గుడి అనంతరెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

