సర్వ విఘ్నాలు తొలిగించే దేవుడు వినాయకుడు. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. నవరాత్రోత్సవాలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఊరూవాడా సర్వాంగ సుందరంగా ముస్తాబైన మండపాల్లో గణనాథుడు నేడు కొలువుదీరనున్నాడు. కాగా, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల స్థానంలో మట్టి ప్రతిమలను పూజించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.
– కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 17