గంభీరావు పేట : మండల కేంద్రంలోని ‘ మన ఇసుక వాహన’ ట్రాక్టర్లను ( Sand Tractors ) బుధవారం గంభీరావుపేట ట్రాక్టర్ యజమానులు( Tractors Owners ) అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మన ఇసుక వాహనం ద్వారా ట్రాక్టర్లలో మండలంలోని మల్లుపల్లి ఇసుక రీచ్ నుంచి గంభీరావుపేట మీదుగా ముచ్చర్ల వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లను గంభీరావుపేట యజమానులు తమ గ్రామం మీదుగా వెళ్లొవద్దని అడ్డుగా నిలిచారు.
గంభీరావుపేట ట్రాక్టర్లు ఇటీవల మల్లు పల్లి ఇసుక రీచ్ కి వెళ్లగా అక్కడ వాళ్లు అడ్డుకున్నారన్నారు. అదే నేపథ్యంలో గంభీరావుపేట మీదుగా వెళ్తున్న మల్లుపల్లి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోవడంతో గ్రామాల మధ్య ఇసుక వాహన కొత్త పంచాయతీ మొదలైంది. దీంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని మల్లుపల్లి, గంభీరావుపేట ఇరు వర్గాల ట్రాక్టర్ యజమానులను సముదాయించడం సమస్య సద్దుమణిగింది.