.. ఇది మంథని-కాటారం ప్రధాన రహదారి గాడుదులగండి గుట్ట. నాడు ఇక్కడ గుట్టను తొలచి రోడ్డు చేశారు. ప్రమాదకరమైన మూల మలుపు కావడంతో ఏటా పెద్దసంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసేవి. అయినా, గత పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూల మలుపును ఘాట్రోడ్డుగా తీర్చిదిద్దాలని అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
6 మీటర్ల వెడల్పుతో ఉన్న రోడ్డును 12 మీటర్లకు పెంచాలని, 300 మీటర్ల పొడవునా ఘాట్ రోడ్డు నిర్మించాలని, గుట్ట కిందకు పడిపోకుండా సీసీ గైడ్వాల్ నిర్మించాలని పనులకు అంచనాలు వేయించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ గైడ్వాల్ నిర్మాణాలను చేపట్టి అందుబాటులోకి తీసుకువచ్చింది. 2017వ రకు ఈ పనులన్నీ పూర్తయి రోడ్డు ఇలా కనిపిస్తున్నది. కాగా, రోడ్డు పూర్తయినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ప్రమాదం కూడా జరుగకపోవడం గమనార్హం
-పెద్దపల్లి, మే 1 (నమస్తే తెలంగాణ)