Fruits Day celebrated | ధర్మారం సెప్టెంబర్ 15: ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రాథమిక పాఠశాలలో ఫ్రూట్స్ డే కార్యక్రమాన్ని పాఠశాల హెచ్ఎం సముద్రాల వంశీ మోహన చార్యుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ఫ్రూట్స్ పై అవగాహన కల్పించారు. కలర్ టెస్ట్ ,నేమ్స్ ఫ్రూట్స్ పై పాఠశాలలో చదువుతున్న ఒకటవ, రెండవ తరగతి విద్యార్థులకు వారి తల్లి తండ్రులు సమక్షం లో ఫ్రూట్స్ గురించి విద్యార్థులచే చెప్పించారు. వాటి రంగు, పండ్ల పేర్లు విద్యార్థులు దానికి సంబంధించిన ఫోటో తో వివరించారు.
విద్యార్థుల కండ్లకు గంతలు కట్టి ఫ్రూట్స్ ముక్కలు నోట్లో పెడితే దాన్ని తిని పండు పేరు చెప్పించారు. ఈ ప్రక్రియను విద్యార్థుల తల్లి తండ్రులు ఎంతో ఆసక్తికరంగా గమనించారు. పాఠశాలలో ప్రైవేట్ కంటే దీటుగా కృత్యం ఆక్టివిటీ ద్వారా పిల్లలకు అర్థం అయ్యే విధంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీ మోహనాచార్యులు వెల్లడించారు. పిల్లలకు కృత్య ధారంగా ఫ్రూట్స్ డే నిర్వహించామని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధాయులు సంపత్, వీవీ లక్ష్మణ్ పాల్గొన్నారు.