Korukanti Chander | కోల్ సిటీ, ఆగస్టు 3: స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని గోదావరిఖని నగరంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బాల్య మిత్రులు అంతా ఒకచోట కలిసి కేక్ లు కట్ చేసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నియోజక వర్గ ప్రజలకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
స్నేహబంధం ఎంతో విలువైనదనీ, మంచి స్నేహితులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఒక్కసారి స్నేహం వీడితే మళ్లీ బలపడటం కష్టమని పేర్కొన్నారు. విజయమ్మ జీవిత భాగస్వామిగానే గాకుండా ఒక మంచి స్నేహితురాలిగా తన రాజకీయ ఎదుగుదలకు ప్రోత్సాహం అందించేదని గుర్తు చేసుకున్నారు. ఆమె జ్ఞాపకాలే నాకు కొండంత బలమని పేర్కొన్నారు. పదవులు ముఖ్యం కాదని.. ప్రజలతో ఉన్న స్నేహమే నాకు ప్రధానమని పేర్కొన్నారు. అలాగే స్థానిక ఫైవింక్లయిన్ చౌరస్తాలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో డివిజన్ ప్రజల సమక్షంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ తమ డివిజన్ ప్రజలు స్నేహితుడి కంటే ఎక్కువగా తనకు వెన్నంటి ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. స్నేహమంటే విలాసాలకు, విందులకే పరిమితం కావద్దని కష్టాలు, కన్నీళ్లలో కూడా తోడు ఉండేవారే నిజమైన స్నేహితులని పేర్కొన్నారు. ఇక్కడ మేకల నవీన్, రాసమల్ల విజయేందర్, నిమ్మతి వేణు, రాజు, ఎర్రోళ్ల రాజు, శ్రీకాంత్, పోరండ్ల నారాయణ, ఆకుతోట ఉమ్మయ్య, గుండెబోయిన శ్రీనివాస్, మద్దెల లక్ష్మణ్, సురేష్, హరీష్, మహేందర్ రెడ్డి, హనుమాన్, బండారి మొగిలి, జనార్ధన్, సంపత్, కాశ్మీర్, శివ, శనిగరపు అనంత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని పలు చోట్ల యువతీ యువకులు, పూర్వ విద్యార్థులు ఆనందోత్సహాలతో వేడుకలు జరుపుకున్నారు. ఒకరికొకరు పరస్పరం చేతులకు ఫ్రెండ్ షిప్ డే గుర్తుగా బ్యాండ్లను కట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.