Huzurabad | హుజూరాబాద్ టౌన్ , జూలై 5 : హుజూరాబాద్ లోని కాకతీయ కాలనీకి చెందిన బుర్ర కవిత తన చిన్ననాటి స్నేహితులు ఆమె బిడ్డలకు అండగా నిలిచి ఔదార్యం చాటుకున్నారు. బుర్ర కవిత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తన పిల్లల భవిష్యత్, విద్యా అవసరాల కోసం విశ్వప్రగతి విద్యాలయానికి చెందిన 1998-1999 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు, కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన 1999-2001 బ్యాచ్ విద్యార్థులు, శాతవాహన డిగ్రీ కళాశాల 2001-04 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు ఆర్థిక సాయం అందించారు.
కవిత కూతురు సుప్రీతి భవిష్యత్ అవసరాల కోసం రూ.2లక్షలను బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. శనివారం ధృవపత్రాలను సుప్రీతికి అందించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్, శ్రీనివాస్, రాజు, అశోక్, శ్రీశైలం, సత్యం, గోవర్ధన్, సంజయ్, రాజు, వనిత, స్వప్న, నర్మద, వెంకటేష్, చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అండగా నిలిచిన స్నేహితులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.