Dharmaram | ధర్మారం, ఫిబ్రవరి 6 : హైదరాబాద్ పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్య పల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత మెగా పశు వైద్య శిబిరం ను నిర్వహించారు. ఇట్టి శిబిరాన్ని గ్రామ సర్పంచ్ మూల మంగ మల్లేశం గౌడ్ ప్రారంభించారు. యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ట్రైనీ పశు వైద్యులు ఈ శిబిరంలో పశు వైద్య శిబిరంలో 253 పశువులకు చూడి నిర్దారణ పరీక్షలు చేశారు. గర్భకోశ వ్యాధి చికిత్సలు చేశారు. అవసరమైన పశువులకు పోషకాహారం గల మందులను పంపిణీ చేశారు.
పశువుల పెంపకంపై వారు సలహాలు, సూచనలు ఇచ్చారు. స్వచ్ఛమైన, నాణ్యమైన పాల కోసం పాడి పశువుల అభివృద్ధి గణనీయంగా పల్లెల్లో పెరగాలని వారు సూచించారు. అందుకు పశువులకు ఎప్పటికప్పుడు వ్యాధుల నివారణ చికిత్సలు చేయించి వాటిని ఆరోగ్యకరంగా ఉంచడానికి పెంపకందారులు కృషి చేయాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ శిబిరంలో పశువైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నళిని, గ్రామ ఉప సర్పంచ్ భూతగడ్డ గట్టమ్మ, పత్తిపాక వెటర్నరీ వైద్యాధికారి జే అనిల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రకాష్, పశు వైద్య సహాయకుడు ఎండీ పాషా గోపాలమిత్రలు వెంకటేశం, వార్డు మెంబర్లు కొమ్మ మధుకర్, మూల బాలయ్య, అమరగాని లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.