Srinidhi Towers | కోల్ సిటీ, మే 20: రామగుండం నగర పాలక సంస్థ 52వ డివిజన్ పరిధి కళ్యాణ నగర్ లో గల శ్రీనిధి టవర్స్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి సహకారంతో బుధవారం ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఆస్పత్రి వైద్యులు హాజరై అపార్ట్మెంట్లోని సుమారు 150 మందికి పైగా బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ తదితర వైద్య పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేశారు. అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ కార్మికులకు, కార్మికేతరులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సామాజిక సేవా బాధ్యత కింద ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. పండగలు, సెలవులు తేడా లేకుండా మెడికవర్ ఆస్పత్రిలో 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అపార్ట్మెంట్ కమిటీ అధ్యక్షుడు దేవదర్శన్ రెడ్డి, కార్యదర్శి బిట్టు వెంకటేష్, సుదం కోటేశ్వర్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, అబ్ధుల్ వకీల్, రమేష్, శ్రీకాంత్, కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.