Free medical camp | వీణవంక, నవంబర్ 8 : వీణవంక మండలంలోని ఎల్బాక గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ ఊట్ల దేవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. లయన్స్ క్లబ్ కరీంనగర్, గోల్డెన్ శాతవాహన, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ సిటీ స్కాన్ డయాగ్నస్టిక్ కరీంనగర్ వారి సహకారంతో శనివారం గ్రామంలో సుమారు 150 మందికి డయాబెటీస్, రక్తపోటు పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మితాహారం తినాలని, ఆకుకూరలు, కూరగాయల భోజనం చేయాలని, మద్యం సేవించరాదని, ప్రతీ రోజు యోగా, వ్యాయామం చేయాలని సూచించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తక్కువ ధరలో ఆరోగ్య పరీక్షలు చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎన్ గిరిధర్‌రావు, కార్యదర్శి నర్సింహరెడ్డి, కో ఆర్డినేటర్ ఎం శంకర్, ఉపాధ్యక్షుడు రాములు, డైరెక్టర్లు గంగాధర్, వెంకటస్వామి, వెంకటస్వామి, డయాగ్నటిక్ సెంటర్ ల్యాట్ నిర్వాహకులు వినయ్, రవి, జిల్లా మాజీ రైతుబంధు సభ్యులు ముత్యాల శంకర్‌యాదవ్ బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఎం.భూమయ్య, మాజీ ఉపసర్పంచ్ రాజారాం, మాజీ సర్పంచ్ మాడ మధుసూదన్‌రెడ్డి, మాజీ వార్డు సభ్యులు కొయ్యడ జాన్, కాశి పాక లూక తదితరులు పాల్గొన్నారు.