Free medical camp | వీణవంక, ఆగస్టు 18: మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత మెగావైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామస్తుల నుండి మంచి స్పందన లభించింది. గ్రామంలో సుమారు 130 మందికి షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలు చేసి, రోగనిర్ధారణ చేసినట్లు, పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ అన్నారు.
ఆసుపత్రిలో 24 గంటలు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, శ్రీకాంత్, సంజీవ్, పంచాయితీ కార్యదర్శి సుష్మ తదితరులు పాల్గొన్నారు.