Free medical camp | కోరుట్ల, ఆగస్టు 25 : కోరుట్ల పట్టణంలోని జీజీ ఫంక్షన్ హాల్ లో కోరుట్ల ప్రెస్ క్లబ్ రెనే హాస్పిటల్, ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితంగా వైద్య శిబిరానికి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు వైద్యులు 200 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఈసీజీ, బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
వైద్య శిబిరాన్ని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి జువ్వాడి నరసింహారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఎస్సై చిరంజీవి, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ అనుప్ రావు, స్వీతీ అనుప్, రేగొండ రాజేష్, గీత ఇంద్రనీల్, అన్వేష్, క్లబ్ ప్రతినిధులు ముక్కెర చంద్రశేఖర్, గంగుల రాంగోపాల్, శిఖరి రామకృష్ణ, నాయకులు అన్నం అనిల్, ఆడెపు మధు, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.