Medical camp | వీణవంక, జూన్ 21: మండలంలోని బొంతుపల్లి గ్రామంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కాగా ఈ శిబిరానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో మంచి స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో 154 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలు చేసి, రోగనిర్ధారణ చేసినట్లు మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ తెలిపారు.
బొంతుపల్లి గ్రామ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే కరీంనగర్ దవాఖానలో 24 గంటలు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు పోలు ఐలయ్య, నాయకులు పోలు ఉస్మాన్, కొమురయ్య, కార్తీక్, ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, శ్రీకాంత్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.