Vemulawada | వేములవాడ, జూన్ 14 : ఉద్యోగ విరమణ పొందిన వృద్ధులకు ఉచితంగా ప్రభుత్వ ఆరోగ్య వసతిని కల్పించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ జనపాల వెంకటయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ కోసం ఆరోగ్య పథకాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. ప్రతీ ఉద్యోగికి బేసిక్ పే నుండి 1.5 శాతం కాంట్రీబ్యాషన్ కట్ చేస్తున్నారని ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా ఈ విధానం సరికాదని చెప్పారు.
పదవి విరమణ వయోవృద్ధులకు ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు. లేదా వయోవృద్ధుల కుటుంబాల ఆధారంగా కనీసం 0.5 శాతం కట్ చేసేలా విధానం అమలు పరచాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా రిటైర్డ్ ఉద్యోగులను పరిగణించడం సరికాదని ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేశారు.