Free, eye surgeries | కోల్ సిటీ, జూలై 18: కంటి సమస్యతో బాధపడుతున్న పలువురికి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఆధ్వర్యంలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని ఆర్యవైశ్య భవన్ లో రేకుర్తి కంటి దవాఖాన సౌజన్యంతో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దాదాపు 102 మందికి కంటి వైద్య పరీక్షలు చేయగా వీరిలో 42 మంది తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతున్నారని గుర్తించి వారిని ప్రత్యేక బస్సులో కరీంనగర్ కు సొంత ఖర్చులతో తీసుకవెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి అద్దాలను అందజేశారు.
మిగతా 60 మందిని బీపీ, షుగర్ కారణంగా ఆపరేషన్ కు తీసుకవెళ్లలేదని, ఆరోగ్యం సహకరించాక తర్వాత ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రీజీయన్ చైర్మన్ కజాంపురం రాజేందర్. జోన్ చైర్మన్ నార్ల ప్రసాద్. క్లబ్ అధ్యక్షుడు గుప్త, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, కోశాధికారి సత్యప్రసాద్ తోపాటు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి అధ్యక్షుడు శ్రీధర్, కోదాటి ప్రవీణ్, సందినేని గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.