వేములవాడ రూరల్, డిసెంబర్ 10: మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నా రు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆదివారం ఆయన పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్‌లో మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించి, మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తుందన్నారు. మహిళలు చార్జీలు లేని ప్రయాణం చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఉచి త ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆర్టీసీ బస్సులో వేములవాడ తిప్పాపూర్ నుంచి చెక్కపల్లి మీదుగా జగిత్యాల బస్టాండ్ వరకు ప్రయాణించారు. అనంతరం మహిళలకు ఉచిత బస్సు టికెట్లు అందించారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, డిపో మేనేజర్ మురళీకృష్ణ, చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్, పుల్కం రాజు, వెంకటస్వామి, రాకేశ్, మధు, స్వామి, సత్యలక్ష్మి ఉన్నారు.
వేములవాడ/వేములవాడ టౌన్, డిసెంబర్ 10: వేములవాడ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆది శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం ఎమ్మెల్యేను వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, అబ్కారి సీఐలు రాము, శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం, రాజన్న ప్రసాదం అందజేసి, శాలు వా కప్పి సన్మానించారు. ఇక్కడ ఎడ్ల శివ, తదితరులు ఉన్నారు.