Stay at school | ఎల్లారెడ్డిపేట, జూన్ 19: మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు తన వ్యవసాయ క్షేత్రంలో పని చేసేందుకు పనికి కుదిరిన మహారాష్ట్రకు చెందిన లచ్చన కట్టెల పిల్లలు సైతం తన తండ్రి వద్దకు రాగా బడీడు పిల్లలను బడిలో అడ్మిషన్ చేయించాలని అనుకుని గురువారం ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ చేయించాడు. అందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మణ్‌రావు స్వగ్రామం హరిదాస్నగర్లోలోని వ్యవసాయ క్షేత్రంలో పని చేసేందుకు మహారాష్ట్రకు చెందిన లచ్చన్న కట్టెలను పనిలో కుదుర్చుకున్నారు.
ఇటీవలే సదరు వ్యవసాయ కూలీ పిల్లలు అవంతి లచ్చన్న కట్టెల, ఆదర్శ లచ్చన్న కట్టెల తమ తండ్రి వద్ద ఉండేందుకు వచ్చారు. ఈ క్రమంలో బడులు ప్రారంభమైన దరిమిలా పిల్లలిద్దరు చదువుకోవాలని లక్ష్మణ్‌రావు ఉపాధ్యాయులతో మాట్లాడారు. వారికి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసి గురువారం వెంకటాపూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. బడీడు పిల్లలు బడిలో చేర్పించేందుకు తన వంతు ప్రయత్నం చేశానని వారి చదువుకు అవసరమయ్యే పూర్తి సహకారం తాను అందిస్తానని భరోసానిచ్చారు.