Manda Krishnamadiga | మంథని, ఆగస్టు 20: ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగను మంథని మాజీ జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్ బుధవారం ఘనంగా సన్మానించారు. మంథనిలోని ఎస్ఎల్బీ గార్డెన్స్‌లో నిర్వహించిన పెన్షనర్ల సన్నాహాక సభ కార్యక్రమానికి మంద కృష్ణమాదిగ హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం సుమలత శంకర్‌లాల్ నివాసంలో మధ్యాహ్న భోజనానికి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మంద కృష్ణమాదిగను తగరం సుమలత శంకర్లాల్లు పూలమాల, శాలువాతో సన్మానించడంతో పాటు బుద్ధిడి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ, అంబాల రాజేందర్ మాదిగ, గోపాల్, పల్లె బాపు మాదిగ, నరిగ మల్లేశ్వరీ, మంథని చందు, ఐరెడ్డి నారాయణరెడ్డి, కేసారపు నరేష్ మా దిగ, మడిపల్లి దశరథం, అగ్గిమల్ల కొమురయ్య మాదిగ, నేదూరి రవి, మంథని లక్ష్మణ్, ఓదెలు, ఆసం తిరుపతి, గద్దల శంకర్, ఊట్ల శ్రీనివాస్, చిలుక సారయ్య, ఇందారపు ప్రభాకర్‌లు పాల్గొన్నారు.