Dasari Manohar Reddy | పెద్దపల్లి రూరల్ నవంబర్ 7 : పెద్దపల్లి మండలంలోని హనుమంతునిపేట మాజీ సర్పంచ్ తీగల సదయ్య తండ్రి తీగల లక్ష్మీరాజం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తీగల లక్ష్మీరాజం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మనోధైర్యంతో ఉండాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే దాసరి వెంట స్థానిక బిఆర్ ఎస్ నాయకులు తీగల ధర్మపురి తదితరులున్నారు.