Kukkalagoodur | పాలకుర్తి: పాలకుర్తి మండలం కుక్కలగూడూరు మాజీ సర్పంచ్ శ్రీపతి శంకరయ్య(రావణ బ్రహ్మ) అనారోగ్యంతో మృతి చెందాడు. సుదీర్ఘకాలంగా పాలకుర్తి మండలంలో సీనియర్ నాయకుడు శ్రీపతి శంకరయ్య గత కొంతకాలంగా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయన కుమారుడు సురేష్ తక్కువ ఓట్లతో ఓడిపోయాడు.
ఆయన మండలంలోని ప్రజలందరికీ చిరుతల రామాయణం కళాకారుడిగా మంచి గుర్తింపు పొందాడు. అందులో రావణ బ్రహ్మ వేషధారణతో పలువురిని ఆకట్టుకునేవాడు. రావణాసుర పాత్ర లో ఏకపాత్రాభినయం చేసి అనేక స్టేజీ షోలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాడు. తన పేరుతో కాకుండా మండల ప్రజలందరూ రావణాసురుడు అని పేరు తో ఎక్కువగా పిలిచేవారు.
ప్రస్తుత రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వీరభిమాని అయిన శంకరయ్య సుధీర్గ కాలం మండల రాజకీయాల్లో సుపరిచితుడు. కాగా శంకరయ్య నూతన సంవత్సరం రోజున అనారోగ్యంతో మృతి చెందాడంతో గ్రామంలో విషాధం నెలకొంది.