Former MPTC, Shobha | చిగురుమామిడి, జూన్ 22: రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ మృతి గ్రామానికి తీరనిలోటని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని రేకొండ గ్రామంలో మాజీ ఎంపీటీసీ చాడ శోభ సంస్కరణ సభ వారి కుమారులు చాడ శ్రీధర్ రెడ్డి చాడ మురళి మనోహర్ రెడ్డి ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడుతూ మాజీ ఎంపీపీ స్వర్గీయ చాడ ప్రభాకర్ రెడ్డి స్ఫూర్తితో వారి సతీమణి చాడ శోభ ఎంపీటీసీగా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.
వివాదరహితులుగా పేరు సంపాదించుకున్నారని కొనియాడారు. పార్టీలకతీతంగా అందరితో మమేకంగా ఉండే వారిని గుర్తు చేసుకున్నారు. వీరి మృతి గ్రామానికి తీరనిలోటని అన్నారు. వారి స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలని అన్నారు. అనంతరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సంస్మరణ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మామిడి అంజయ్య, అందే స్వామి, బోయిని అశోక్, పెసరి రాజేశం, కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, గోలి బాపురెడ్డి, బూడిద సదాశివ, ముద్రకోల రాజయ్య, గూడెం లక్ష్మి, కోహెడ సృజన కుమార్, కూన లెనిన్, నాగేల్లి లక్ష్మారెడ్డి, బిళ్ళ జైపాల్ రెడ్డి, ఐరెడ్డి భాస్కర్ రెడ్డి, కరీంనగర్ మాజీ కార్పొరేటర్ శైలేందర్ యాదవ్, రేకొండ శివాలయ ఆలయ చైర్మన్ తమ్మిశెట్టి రమేష్, రామకృష్ణ మండల పరిషత్ సూపర్డెంట్ ఖాజా మొహియుద్దీన్, బోయిని బాబు, అందే చిన్న స్వామి, ముద్రకోల రాజయ్య, తాటికొండ సందీప్ రెడ్డి, నాగిళ్ల సదానందం, మాడ సునీల్ రెడ్డి, అరిగెల రమేష్, రఘు, కొమురవెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.