గంగాధర, మే 18: బాలికకు న్యాయం చేయాలని, పోక్సో కేసు నమోదైననాటి నుంచి కొడుకును కాపాడేందుకు యత్నించిన కేంద్రమంత్రి సంజయ్‌ను కేబినేట్ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. సోమవారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్, జగిత్యాల జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. సుంకె మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, నేరాలు జరుగుతున్నా పోలీసులు కండ్లప్పగించి చూస్తున్నారని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని మోదీ ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అనే నినాదాన్ని తీసుకువస్తే, రాష్ట్రంలో కేంద్ర మంత్రుల కొడుకులు మహిళలు, బాలికలపై లైంగిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల, సోషల్ మీడియా వారియర్స్ చేసిన ఉద్యమంతో ప్రభుత్వం దిగివచ్చి భగీరథపై పోక్సో కేసు నమోదు చేసిందన్నారు. ఇకడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, కంకణాల విజేందర్‌రెడ్డి, అయిలినేని సాగర్‌రావు, సత్తినేని మాధవ్, కత్తెరపాక కొండయ్య, గడ్డం చుకారెడ్డి, ఎండీ నజీర్, తోట మహిపాల్, పంజాల ఆంజనేయులు, వడ్లూరి ఆదిమల్లు, జోగు లక్ష్మీరాజం, దోమకొండ మల్లయ్య, నిమ్మనవేని ప్రభాకర్, మామిడిపల్లి అఖిల్, గంగాధర సంపత్ పాల్గొన్నారు.