మూసాపేట, జూలై26: టిప్పర్ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో ఇంటర్ విద్యార్థికి తీవ్రగాయాలైన ఘటన కూకట్పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ స్వామిగౌడ్ తెలిపిన వివరాల ప్రకా రం….. యూసుఫ్‌గూడకు చెందిన బేగరి మహేష్ (17), మన్నె లక్ష్మీతేజ(17), పులి కిరణ్‌కుమార్ (17) ముగ్గురూ స్నేహితులు. మహేష్, లక్ష్మీతేజ అమీర్‌పేటలోని అరోమా జూనియర్ కాలజీలో ఇం టర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు.
పులికిరణ్ అమృత కాలజీలో చదువుతున్నాడు. ఆదివారం సెల వు కావడంలో ముగ్గురూ కలసి పులి కిరణ్‌కుమార్ బైక్‌పై క్రికెట్ ఆడుకోవడం కోసం ఆదివారం ఉద యం సుమారు 4గంటల సమయంలో ఇంటి నుం చి బయటకు వెళ్లారు. ఆట ముగిసిన తరువాత కూకట్పల్లి మహలక్ష్మీ కేఫ్‌లో టీ తాగడానికి అదే బైక్‌పై ముగ్గురు మూసాపేట నుంచి కేపీహెచ్‌బీకాలనీ వైపు వెళుతుండగా మెట్రో ఫిల్లర్ 796 వద్దకు రాగానే టిప్పర్‌ను ఆకస్మాత్తుగా కుడి వైపు తిప్పడంతో బైక్ టిప్పర్‌కు ఎడుమవైపు తగిలింది.
ప్రమాదంలో బైక్ నడుపుతున్న పులి కిరణ్‌కు తీవ్రగాయాలు కాగా వెనుక కూర్చున్న మహేష్, లక్ష్మీతేజ టిప్పర్ లారీ వెనుక చక్రాల కింద పడడంతో ఇద్ద రు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పులి కిరణ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమా ర్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని లారీని పీఎస్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.