Sunke Ravi Shankar | బోయినిపల్లి రూరల్, జనవరి 8 : బోయినిపల్లి మండలం అనంతపల్లి లో జంగ వెంకటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ గురువారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ అజ్జు, మాజీ ఉపసర్పంచ్ పర్స మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు మల్లారపు చందు, చంద్రగిరి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.