చట్టం.. కేంద్ర మంత్రికి చుట్టమా..?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ విషయంలో పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. చట్టం కేంద్రమంత్రికి చుట్టమా..? సామాన్య ప్రజలకో న్యాయం? కేంద్రమంత్రికో న్యాయమా..? అని ప్రశ్నించారు. కేంద్రం అమలు చేస్తున్న ‘బేటీ బచావో.. బేటీ పడావో’ నినాదం నిజమైతే సంజయ్‌ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, భగీరథ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
- మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర, మే 11 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ విషయంలో పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. చట్టం కేంద్రమంత్రికి చుట్టమా..? సామాన్య ప్రజలకో న్యాయం? కేంద్రమంత్రికో న్యాయమా..? అని ప్రశ్నించారు. కేంద్రం అమలు చేస్తున్న ‘బేటీ బచావో.. బేటీ పడావో’ నినాదం నిజమైతే సంజయ్‌ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, భగీరథ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గంగాధర మండలంలోని మధురానగర్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సంజయ్ కొడుకు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదై దేశవ్యాప్తంగా దుమారం రేపినా, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రులు, నాయకులు నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. భగీరథ్‌ను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. అసలు భగీరథ్ ఎకడ ఉన్నాడని ప్రశ్నించారు. రాష్ట్రానికి అమ్మనవుతానని మాటలు చెప్పిన కవితక బాలిక విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారన్నారు. బాలిక విషయంలో మధ్యవర్తిత్వం వహించిన సంగప్పపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ఒత్తిళ్లను పకనపెట్టి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సర్పంచులు వేముల దామోదర్, కరబూజ తిరుపతిగౌడ్, నాయకులు సాగి మహిపాల్‌రావు, కంకణాల విజేందర్‌రెడ్డి, ఉప్పుల గంగాధర్, ముకెర మల్లేశం, శ్రీమల్ల మేఘరాజు, ఎండి నజీర్, రాసూరి మల్లేశం, పొట్టల కనకయ్య, దోమకొండ మల్లయ్య, పొన్నం పర్శరాములు, ఎండి అజ్జు, సముద్రాల అజయ్, నేరెళ్ల ఐలయ్య, గంగాధర మోహన్, కల్లెపెల్లి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

