రాజన్న సిరిసిల్ల, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ‘ఎందరో అమర వీరుల త్యాగానికి ప్రతిఫలమే తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ సారథ్యంలో జరిగిన రాష్ట్ర సాధన పోరాటం చారిత్రాత్మకం’ అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొనియాడారు. సిరిసిల్ల పట్టణంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. స్వ రాష్ట్ర సాధన అనంతరం తొలి సీఎం కేసీఆర్ నా యకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు.
స్వరాష్ట్రం కోసం చేసిన అమర వీరుల త్యాగాలు, తెలంగాణ ప్రజల పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. తొలి దశ తెలంగాణ పోరాటమైనా, మలిదశ తెలంగాణ ఉద్యమమైనా మనకు గు ర్తుకు వచ్చేది అమరుల త్యాగమేనన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఉద్యమాన్ని, మలి దశ పోరాటాన్ని కేసీఆర్ ముందుండి నడిపించారని తెలిపారు. అందుకు స్ఫూర్తి మాత్రం అమరుల త్యాగాలే అన్నది అక్షర సత్యమని చెప్పారు. శతాబ్ది కాలంలో జరుగని అభివృద్ధిని బీఆర్ఎస్ దశాబ్దకాలం పాలనలో చేసి చూపించిందన్నారు.
పదేండ్లలోనే వ్యవసాయం పండగలా మారిందని, విద్యుత్, విద్యరంగంలో ఆదర్శంగా నిలిచిందని వివరించారు. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి వైద్య రంగాన్ని అగ్రస్థానంలో నిలిపిన ఘనత మన కేసీఆర్‌దేనని కొనియాడారు. ఆనాడు సమైక్య పాలకులు, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదురెల్లి పోరాటం చేసిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదన్నారు. కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయించకుండా, రైతులకు నీళ్లు ఇవ్వకుండా పొలాలు ఎండబెట్టిన అసమర్థ ప్రభు త్వం కాంగ్రెస్ అని విమర్శించారు.
తెలంగాణ కోసం మాట్లాడే హక్కు గులాబీ జెండాకే ఉంద ని స్పష్టం చేశారు. అంతకుముందు నేతన్న చౌక్‌లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నా యకులు ఘన నివాళులర్పించారు. స్వరాష్ట్ర సా ధన కోసం అమరులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్లో పార్టీ జెండాను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ జాతీయ పతాకాలను ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి మ్యాన రవి, ఎండీ సత్తార్, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఉన్నారు.