ముత్తారం, డిసెంబర్ 18: ‘కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైంది. రాష్ట్రంలోని సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం అం దించలేని దుస్థితిలోకి వెళ్లిపోయింది. విద్యార్థుల పొట్ట కొడుతరా..? కడుపులు మాడుస్తరా..? ఇదేం ప్రభుత్వం’ అని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. ముత్తారం మండలం దర్యాపూర్ మోడల్ సూల్ను బుధవారం ఆయన సందర్శించారు. అకడి పరిస్థితుల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పుట్ట మధూకర్ మాట్లాడారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో అనేక చో ట్ల భోజనం నాణ్యత లేకుండా పోయిందని, దర్యాపూర్ మోడల్ సూ ల్లో ఏకంగా వారం రోజులుగా విద్యార్థులకు భోజనం అందించడం లేదని ఆరోపించారు.
పిల్లలు ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకునే దుస్థితి వచ్చిందన్నారు. అయినా వారం పాటు భోజనం పెట్టకున్నా అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది నెలలుగా బిల్లులు రాకపోవడంతోనే నిర్వాహకులు భోజనం అందించడం లేదని తెలిపారు. మంత్రి ఇలాకలోని మోడల్ సూల్ పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పటికీ కనీసం స్పందించే వారే లేరని చెప్పారు. మంథని నియోజక వర్గంలోని మోడల్ సూళ్లలో విద్యార్థులకు భోజనాలు బంద్ అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మంత్రిగా, మంథని ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబు విఫలం అయ్యారని విమర్శించారు.
ప్రతిపక్షాలపై దాడులకు దిగడం, కేసులు పెట్టించడం ఆపి పరిపాలనపై, ప్రభు త్వ పాఠశాలలు, దవాఖానల పనితీరుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజా సమస్యలు ఎకడున్నా స్పందిస్తామని, ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని స్పష్టం చేశారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ జకుల ముత్తయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి, మాజీ సింగల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నూనె కుమార్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ నాంసాని సమ్మయ్య, దర్యాపూర్ మాజీ సర్పంచ్ గాదం స్రవంతి శ్రీనివాస్, నాయకులు రామగళ్ల మధు, తిత్తుల శ్రీనివాస్, గిరి వీరేందర్, తాత బాలు ఉన్నారు.