మంథని, డిసెంబర్ 13: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన మంత్రి శ్రీధర్‌బాబుపై 420 చీటింగ్ కేసు నమోదు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. ఆయనపై పోలీసులకు రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేస్తానని, పోలీసులు స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఏడాది కాలం గడుస్తున్నా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. తాను ఓట్ల కోసం బతికే నాయకుడిని కాదని, ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తినని, కాంగ్రెస్ హామీలను అమ లు చేసే దాకా పోరాడుతామని, ఎన్ని విధాలుగా భయబ్రాంతులకు గురి చేసిన వెనుకడు గు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మంథనిలోని రాజగృహలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మం త్రి శ్రీధర్‌బాబుపై ఫైర్ అయ్యారు. నాడు ఎ న్నికల ప్రచారంలో భాగంగా ముత్తారం వేదికగా మహిళల అభ్యర్థన మేరకు బెల్టుషాప్‌ల ను లేకుండా చేస్తామని హామీ ఇచ్చారని, ఇ ప్పుడెందుకు బంద్ చేయడం లేదని ప్రశ్నించారు. చదువురాని నాయకుడి మూలంగా మంథని అభివృద్ధిలో వెనుకబడిపోయిందని ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తనపై ఎద్దేవా చేశాడని, కానీ, ఉన్నత చదువులు చదివాడని గొప్పలు చెప్పే మంథని ఎమ్మెల్యే ఏం చేశారని నిలదీశారు. మంథని నియోజకవర్గ ప్రజలు 40 ఏండ్లుగా ఒకే కుటుంబానికి అధికారం అప్పగిస్తే ఏం అభివృద్ధి పనులు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరు ను ప్రశ్నిస్తే కింది స్థాయి నాయకులతో దూ షించేలా మాట్లాడించడం, తనపై దాడులు చేయించడం సరైంది కాదని, నియోజకవర్గ అభివృద్ధికి ఆలోచన చేయాలని హితవు పలికారు.
అధికారంలోకి వచ్చి శ్రీధర్‌బాబు మం త్రిగా ఉన్నా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఎం దుకు పట్టించుకోవడం లేదన్నారు. ఓడేడు వంతెనపై నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై నింద లు వేశారని, ఇప్పుడెందుకు పూర్తి చేయడం లేదన్నారు. మల్హర్ మండలం కిషన్‌రావుపల్లి నుంచి భూపాలపల్లి వరకు రహదారి నిర్మా ణం కోసం ఫారెస్ట్ శాఖకు 4కోట్ల నిధులను ఎందుకు మంజూరు చేయలేకపోతున్నారన్నా రు. ఏడాది కాలం లో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఏ ఒక్క అభివృద్ధి పని చేయని అసమర్థుడు మంథని ఎమ్మెల్యే అని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగ రం శంకర్‌లాల్, ఆరెపల్లి కుమార్, కిషన్‌రెడ్డి, పెగడ శ్రీనివాస్, కుమార్, మిర్యాల ప్రసాద్‌రావు, వీరారెడ్డి, కాయితి సమ్మయ్య, శంకేసి రవీందర్, మంథని లక్ష్మణ్, వెల్పుల గట్ట య్య, ఆకుల రాజబాపు, మాచీడి రాజుగౌడ్, ఆసిఫ్, ఇర్ఫాన్, నాయకులు పాల్గొన్నారు.