Putta Madhu | ముత్తారం, జూన్ 22: మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దుబాసి దేవేంద్ర శ్రీనివాస్ తల్లి మల్లేశవ్వ ఇటీవల మరణించగా ఆదివారం రోజున మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా మృతురాలు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఇక్కడ మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు నూనె కుమార్, సింగిల్ విండో డైరెక్టర్ రమణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ దివాకర్, నీమ్మతి రమేష్, బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.