గోదావరిఖని, ఏప్రిల్ 10: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ దండు కదం తొక్కాలని, ఓరుగల్లు దద్దరిల్లాలని ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని నిర్దేశం చేశారు. బుధవారం రాత్రి గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీ ఫంక్షన్హాల్లో జరిగిన పార్టీ నియోజకవర్గ ముఖ్యనేతల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు.
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన ఫెయిల్ అయిందని, ఏడాదిన్నర కాలంలో ప్రజలకు చేసిందేమీలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీస్తే తనతోపాటు పార్టీ నాయకులపై 12 కేసులు పెట్టించారని ఆగ్రహించారు. అయినా ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాడుతునే ఉంటామని స్పష్టం చేశారు. రోజురోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నదని, ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే సభకు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కౌశికహరి, నడిపెల్లి మురళీధర్‌రావు, పెంట రాజేశ్, జేవీ రాజు, గోపు అయిలయ్య, పాముకుంట్ల భాస్కర్, రమణారెడ్డి, కల్వచర్ల కృష్ణవేణి, రాకం వేణు, శ్రీనివాస్, కవిత సరోజని, అచ్చెవేణు, తిరుపతి, శ్రీనివాస్, సదానందం, తిరుపతి, దేవరాజ్ సంధ్యారెడ్డి, లక్ష్మి, శ్రీనివాస్, వెంకన్న, రామారాజు, శ్రావాణ్, రామకృష్ణ, వెంకటేశ్ పాల్గొన్నారు.
ప్రతి ఊరు నుంచి కదలుదాం
జగిత్యాల రూరల్, ఏప్రిల్ 10: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కదలుదామని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసి మరోసారి మన సత్తా చాటుదామని చెప్పారు. జగిత్యాల రూరల్ మండలం చలిగల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు వస్తున్నాయని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని భూములు అమ్మడం తప్పా.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పరస్పరం విమర్శించుకోకుండా జగిత్యాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం, జిల్లా అభివృద్ధి చెందాయని చెప్పారు. తెలంగాణను దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కొనియాడారు.
ఇకముందు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయకత్వం తప్పనిసరి చెప్పారు. ఎల్కతుర్తిలో నిర్వహించే మహాసభకు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో రూరల్ మండలాధ్యక్షుడు ఆనందరావు, పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, నాయకులు గంగారెడ్డి, కమలాకర్‌రావు, ఎల్ల రాజన్న, నలువాల తిరుపతి, పూదరి శ్రీనివాస్, బాలే చందు, పోచమల్లయ్య, యాళ్ల మహేశ్, పడాల సురేశ్, పులిశెట్టి శ్రీనివాస్, శ్రీను, మామిడిరాజు, తరాల వెంకటేశ్, బొల్లారపు గంగాధర్, గోపాల్, షేర్, సైప్, అంజన్న, శ్రీను, దర్శన్, రాకేష్, శివ, సింగావు, గంగాధర్ పాల్గొన్నారు.