PedddapallY | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 18: పెద్దపల్లి మండలంలోని సబ్బితం గ్రామంలో వివిధ కారణాలచే చనిపోయిన మృతుల కుటుంబాలను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శుక్రవారం పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. సబ్బితం సర్పంచ్ గా రెండు పర్యాయాలు పని చేసిన గంకిడి శ్రీనివాస్ అనసూయ దంపతులు పని చేసిన సమయంలో చేసిన సేవలను గుర్తు చేస్తూ శ్రీనివాస్ మృతికి గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మనోధైర్యం కోల్పోకుండా గుండెనిబ్బరంతో ఉండాలని సూచించారు. అలాగే గ్రామానికీ చెందిన మాజీ వార్డు సభ్యులు దూడపాక శంకరయ్య తల్లి దుడపాక దుర్గమ్మ అనారోగ్యంతో మరణించగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్ చుంచు సదయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్, రవి, రహీం, సురేష్, చందు, రవి, సందీప్, లడ్డు హరి శంకర్, బాండు, సంతు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.