Dasari Manohar Reddy | కాల్వ శ్రీరాంపూర్ జూలై 4 : కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో ఇటీవల ఒగ్గు కథ కళాకారుడు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన కన్నూరి విజయ్, అలాగే ఆసంపెల్లి, సదయ్య తల్లి ఆసంపల్లి గాలమ్మ, గట్టు, రాజమ్మ ఇటీవల మృతి చెందారు. కాగా ఆ మృతుల కుటుంబాలను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు.
మృతుల కుటుంబాలను ఓదార్చి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వoగల తిరుపతిరెడ్డి , బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు నూనెటి కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు, జంగా శ్రీనివాస్ రెడ్డి, గోలి సత్యనారాయణరెడ్డి, మేకల సాయిలు, ఎడెల్లి శంకర్, కొంకటి స్వామి, ఆసంపల్లి కిష్టయ్య, ఎడెల్లి స్వామి, చలిగంటి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.