Dasari Manohar Reddy | పెద్దపల్లి రూరల్, జూలై 13 : అనారోగ్యం బారిన పడి కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు లైసెట్టి రాజు, 3వ వార్డ్ మాజీ కౌన్సిలర్ లైసెట్టి భిక్షపతి తండ్రి లైసెట్టి భూమయ్యను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శనివారం దవఖానకు వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా దవఖాన డాక్టర్ ను భూమయ్య ఆరోగ్య పరిస్థితి పై అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ను కోరారు. ఆయన వెంట పెంచాల శ్రీధర్, ఉప్పు రాజ్ కుమార్, పూదరి చంద్రశేఖర్ ఉన్నారు.