Grand welcome | పెగడపల్లి: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల అమెరికాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొని తిరిగి శనివారం స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ గార్లకు ధర్మపురి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు శాలువాలు కప్పి, పుష్ప గుచ్ఛాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.