ఎదులాపురం, మే 25 : మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందాడు. సోమవారం శాంతినగర్లో జరిగిన అంత్యక్రియల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని పాడే మోశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు.
ఆ పార్టీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అజయ్, ఇజ్జగిరి నారాయణ, జోగు మహేందర్, అడప తిరుపతి, రాఘవేంద్ర, కొండ గణేశ్, బొజ్జ సంతోష్, రాము పాల్గొన్నారు.