Dharmaram | ధర్మారం, మార్చి 7 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లె గ్రామ మూడో వార్డు మెంబర్ కొమ్ము మహేందర్ యాదవ్ ను రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. రెండు రోజుల క్రితం గ్రామంలో మహేందర్ నడుపుతున్న బైకును మరో వ్యక్తి బైక్ తో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
మహేందర్ చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరాడు. చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఈశ్వర్ శనివారం సదరు దవాఖానకు వెళ్లి బాధితుడు మహేందర్ ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మహేందర్ కు మెరుగైన వైద్య సహాయం అందించాలని దవాఖాన వైద్యులకు ఆయన సూచించారు. అతడు త్వరగా కోలుకోవాలని ఈశ్వర్ ఆకాంక్షించారు. ఇక్కడ ఆయన వెంట ఎర్రగుంటపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.