Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 3 : చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ బుధవారం రాత్రి గుండెపోటుతో చెందాడు. చాతిలో నొప్పి రావడంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే గుండెపోటుతో రవీందర్ మృతి చెందాడు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో ప్రభుత్వ పోలీసు ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకొని ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. పలుమార్లు ఉద్యమంలో పాల్గొని పోలీసుల దెబ్బలు తినడంతో పాటు పలుమార్లు అరెస్టయ్యారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మద్దతుతో రెండు పర్యాయాలు సర్పంచ్‌గా, జడ్పీటీసీ ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడిగా 12 సంవత్సరాలు పైగా పనిచేశాడు. జడ్పీటీసీగా గ్రామంలో, మండలంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టారు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉండడంతో మండల ప్రజల్లో అభిమానాన్ని చూరగొన్నాడు.
ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. రెండున్నర సంవత్సరాల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల డీసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రవీందర్ మృతి పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు వోడితల సతీష్ కుమార్, చాడ వెంకటరెడ్డి వేరువేరుగా రవీందర్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, వివిధ పార్టీల మండల అధ్యక్షులు మామిడి అంజయ్య, అందె సురేష్, పోలోజు సంతోష్, నాగెల్లి లక్ష్మారెడ్డి, వివిధ పార్టీల నాయకులు బేతి రాజిరెడ్డి, చిట్టి మల్ల రవీందర్, చిట్టిమల్ల శ్రీనివాస్, అచ్చ రవీందర్, జక్కుల రవి, సన్నీల్ల వెంకటేష్, చాడ శ్రీధర్ రెడ్డి, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు పిట్టల రవీందర్, చొప్పరి వేణు, గుర్రాల మల్లేశం, కునచుల మహేందర్, మండలానికి చెందిన సర్పంచ్ లు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కాగా చిగురుమామిడి మండల కేంద్రంలోని డార్విన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మాజీ జెడ్పిటిసి రవీందర్ మృతి పట్ల విద్యార్థులు ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. పాఠశాల కరస్పాండెంట్ సమ్మిరెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు టీచర్‌గా ప్రజా నాయకుడిగా గ్రామంలో సర్పంచ్ గా విద్యాభివృద్ధి కోసం కృషి చేశాడని కొనియాడారు. అతని మృతి తీరని లోటు అని అన్నారు.