Foreign currency | కాల్వ శ్రీరాంపూర్ జూన్ 29 : మండలంలోని మొట్లపల్లి శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రమణ్య స్వామి రామాలయం, శివాలయం, పోచమ్మ ఆలయాలలోని హుండీలో భక్తులు విదేశీ కరెన్సీ నోట్లు వేశారు. ఆలయ కమిటీ చైర్మన్ దోమ్మటి రవి గ్రామస్తుల సమక్షంలో హుండీ లెక్కింపు ఆదివారం చేపట్టారు. కాగా హుండీలో విదేశీ కరెన్సీ నోట్లు దర్శనం ఇవ్వడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ దోమ్మటి రవి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ జంగా ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రూపిరెడ్డి మోహన్ రెడ్డి, మాజీ సర్పంచులు తుల మనోహర్ రావు, గోనే శ్యామ్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.