Food donation | సుల్తానాబాద్ రూరల్ మే 1: అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని యువ సంకల్ప పౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వికాసం వికలాంగుల పునరావాస కేంద్రంలో గురువారం సుల్తానాబాద్ పట్టణానికి చెందిన కందుకూరి పద్మ ప్రకాష్ రావు (పెద్దన్న)చిన్న కుమారుడు కందుకూరి సాయి అఖిల్ జన్మదినం సందర్భంగా మానసిక వికలాంగుల పునర్వాస కేంద్రం లోని పిల్లలకు చికెన్ బిర్యానీ, అరటి పండ్లు వాటర్ మిలన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ గత ఎనమిది సంవత్సరాల నుండి నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా కందునూరి పద్మ -ప్రకాష్ రావు దంపతులు ఇంట్లో ఏ కార్యక్రమం అయినా తాము చేస్తున్న అన్నదాన కార్యక్రమానికి సేవా కార్యక్రమాలకు వారి వంతు సాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారని, వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యారాలలో సుఖసంతోషాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యుడు రమేష్ సెంటర్ సెంటర్ ఇన్చార్జి శ్రీనివాస్ , సరస్వతి సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.