Food distribution | సుల్తానాబాద్ రూరల్, జూలై 30 : పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వికాసం వికలాంగుల పునరావాస కేంద్రంలోని చిన్నారులకు క్లబ్ ప్రతినిధులతో అన్న వితరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లా గవర్నర్ పిలుపుమేరకు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పూర్వ ఇంటర్నేషనల్ డైరెక్టర్, లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా చిన్నారులకు క్లబ్ ప్రతినిధులు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా బాబురావు నిరుపేదలకు, బడుగు, బలహీన వర్గాలకు తన సొంత డబ్బును పలుమార్లు విరాళంగా అందజేసినట్లు తెలిపారు. అనేక సేవా కార్యక్రమాలతో సమాజా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ప్రజలకు మరిన్ని సేవలు అందించుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.
అంతకుముందు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు జూపల్లి తిరుమల్ రావు, లయన్స్ 320జీజీఈటో కో-ఆర్డినేటర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, జోన్ చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా చీఫ్ కో-ఆర్డినేటర్ వలస నీలయ్య, జిల్లా కో-ఆర్డినేటర్లు మాటేటి శ్రీనివాస్, జూలూరి అశోక్, సభ్యులు పూసాల సాంబమూర్తి, దీకొండ భూమేష్, తమ్మనవేని సతీష్, ఏనుగు నరేందర్ రెడ్డి పునరావాస కేంద్రం బాధ్యులు శ్రీనివాస్, కళ్యాణితో పాటు చిన్నారులు పాల్గొన్నారు.