free seminar | కమానౌచౌరస్తా, సెప్టెంబర్ 20: విట్ జీ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 28వ తేదీ వరు పదో తరగతి విద్యార్థులకు ఐఐటీ, నీట్లపై అవగాహన, సబ్జెక్టులపై పట్టు సాధించడానికి ఉచిత సెమినార్లను నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ వంగపల్లి రాజేశ్వర్ పేర్కొన్నారు. ఈ మేరకు కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉచిత అవగాహన సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు.
పదో తరగతి సెలబస్ పై అవగాహన తరగతులు, ఆ తర్వాత ఐఐటీ, నీట్ వంటి జాతీయ పరీక్షలలో ఎలా రాణించాలి అనే అంశాలపై సెమినార్లు ఉంటాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆసక్తి గల వారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ లో ఉన్న విట్ జీ గర్ల్స్ క్యాంపస్లో సంప్రదించాలని, మరింత సమాచారం కోసం 98486 84004లో వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.