ఎల్లారెడ్డిపేట, మార్చి 30 : అడవి బతికితే భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు దొ రుకుతుందని గత ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమాలు గ్రీన్ కవరేజ్ పెరిగేందుకు దోహదపడింది. అడవిపై కత్తిగట్టే యత్నం చేసిన వారిపై కఠినంగా వ్యవహరించడంతో అడవి పదిలంగా ఉండేదని అటవీ గ్రామాల ప్రజలు అంటున్నారు. కొంత కాలంగా ఏదో ఓ చోట పచ్చని అడవిని బుగ్గిపాలు చేసి కబ్జా చేసేందుకు యత్నం చేస్తుండగా మరికొంతమంది సాధారణంగా చేసే పనులతో అడవి అంటుకుంటున్నదని అటవీగ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎండకాలం సమీపించేవేళ గతంలో అడవిలో ఫైర్‌లైన్స్ ఏ ర్పాటు చేసి మంటలు విస్తరించకుండా ఏర్పా టు జరిగేది. ఈ ఏడాది ఫైర్లైన్స్కు నిధులు రాకపోవడంతో ఎక్కడపడితే అక్కడ మానవ ప్రయత్నమో, సహజ కారణమో మొత్తానికి ప చ్చని అడవి ఎర్రటి మంటల్లో కాలిబూడిదై పో త్నున్నది. విలువైన అటవీ సంపదకు అపార నష్టం కలుగుతుండగా, జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది.
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రేంజ్‌ల పరిధిలో 12 సెక్షన్లు, 44బీట్లలో కలిపి సు మారు 27వేల హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. జిల్లాను జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేటతో కలిపి అడవులు ఉన్నా యి. ఉన్న అడవుల్లో ఎక్కువ శాతం ఆకురాల్చే వృక్షాలే కావడంతో ఎండాకాలం అగ్నిప్రమాదాల ప్రమాదం పొంచి ఉంటుంది. దీంతో మంటలు వ్యాపించకుండా అడవిలో మీటరు కు రూ.6 చొప్పున ప్రతి వంద చదరపు మీటర్లకు ఒక ఫైర్‌లైన్ వేసి ఆ చదరపు లైన్ దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వీటితోపాటు చిన్న ప్రమాదాలు సంభవించినప్పుడు బ్లోయర్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తారు.
పశువుల కాపరులు తమ పశువులను మేతకు తీసుకెళ్లే క్రమంలో కొందరు బీడీలు తాగి ఎక్కడపడితే అక్కడ వేస్తుంటారు. ఈ క్రమంలో ఎండిన ఆకులు అంటుకొని మంట లు తీవ్రమై వనదహనం జరిగిన ఘటనలున్నాయని అధికారులు చెబుతున్నారు. కొందరు ఇప్పపూలు తీసేందుకు కొందరు చెట్టుకింద శుభ్రం చేసే క్రమంలో ఎండిన ఆకులను తీసి మంటపెట్టడం, తునికాకు తీసేందుకు వెళ్తున్న క్రమంలో బాగా రావడానికి మంటలు పెట్ట డం, కొందరు ఆకతాయి యువకులు అడవి లో మద్యం తాగుతూ, సిగరెట్లు తాగి పడేసిన సందర్భంలో అడవులు అగ్నికి ఆహుతవుతూ ఉంటాయి. ఇక అన్నింటికంటే ప్రమాదకరమై న కారణం అడవిని కబ్జా చేయాలనే కుటిలయత్నాలు కూడా అక్కడక్కడా జరుగుతున్నట్లు పలు గ్రామాల ప్రజలు అనుకుంటున్నారు. ఇటీవల ఎల్లారెడ్డిపేట మండలం గుండారం లో ఏకంగా 55 హెక్టార్ల మేర అడవి అంటుకోవడం వెనుక కుట్ర ఉందని సదరు భూమిపై కొందరు కన్నేసిన క్రమంలోనే ఇది జరుగుతుందని అనుకుంటున్నారు. అలాగే కొందరు చెట్లను నరుకుతున్న క్రమంలో, పోడు భూమి ఉందని లేకున్నా వితండవాదం చేస్తున్న వా రిని కట్టడి చేస్తున్నారనే కారణంతో అటవీశాఖ అధికారుల ఆత్మైస్థెర్యం దెబ్బతినేలా కొందరు దుందుడుకు చర్యలకు దిగుతున్నారని అటవీగ్రామాల ప్రజలు, పర్యావరణ ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏటా ప్రభుత్వం వేసవి సమీపిస్తున్న తరుణంలో ఫైర్లైన్స్కు నిధులు కేటాయించేది. దీంతో వారు కూలీలను నియమించి అడవిలో మంటలు విస్తరించకుండా ప్రతి వంద చదరపు మీటర్లకు ఓ ఫైర్‌లైన్ ఏర్పాటు చేసేది. అడవిలో సహజ, మానవ చర్యలతో అడవులంటుకుంటే శాటిలైట్, అక్కడున్న మనుషుల ద్వారా సమాచారం అందుకుని మంటలార్పే యత్నం చేసేది. అప్పటికే ఉన్న ఫైర్లైన్స్తో మంటలు విస్తరించకుండా నియంత్రణ ఉండ గా అటవీశాఖ అధికారులు అక్కడికి వెళ్లి అగ్ని ప్రమాదాలను కంట్రోల్ చేసేది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఫైర్లైన్స్కు నిధులు కేటాయించకపోవడంతో అడవిలో పశువులు, గొ ర్రెల కాపరులు, అటవీ గ్రామాల ప్రజలకు వన దహనంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పా టు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఏదై నా కారణంతో అడవులంటుకుంటే అక్కడికి చేరేలోపు ఫైర్‌లైన్స్ లేని కారణంగా ఎక్కువభా గం అడవులకు నిప్పంటుకుంటుండగా అధికారులు చేష్టలుడి చూస్తున్నారు. చిన్నచిన్న ప్ర మాదాలు సంభవించినప్పుడు బ్లోయర్లతో మంటలార్పుతున్నారు.
ఇప్పటి వరకైతే ఫారెస్ట్‌లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్‌లైన్స్ వేయలేదు. ఇంకా నిధులు రాకపోవడంతో ఏర్పాటు చేయలేదు. త్వరలోనే నిధులు వస్తాయని ఉన్నతాధికారులు చెపుతున్నారు. వచ్చిన వెంటనే ఫైర్‌లైన్స్ వేయిస్తాం. కావాలని కొంద రు అడవిని అంటిస్తున్నట్లు మాకు తెలియదు. గుండారంలో జరిగిన వన దహనంపై విచార ణ చేస్తున్నాం. మానవ ప్రయత్నమని తేలితే చట్ట ప్రకారం ముందుకెళ్తాం. అడవిని కాపాడుకోవడం అందరి బాధ్యత. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా స్పందించాలి. సమాచారం అందించాలి. వీలైతే మంటలార్పేందుకు తమవంతు సహకారం అందించాలి.