Mallapoor | మల్లాపూర్ జులై 11: మండల కేంద్రంలోని స్థానిక కేడీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ భూక్య ప్రవీణ్ మాట్లాడుతూ బ్యాంకు నుంచి జరిగే ఆర్థిక లావాదేవీలు బ్యాంకు డిపాజిట్స్, లోన్స్ ఇన్సూరెన్స్, స్కీమ్స్ పై వివరించారు.
అనంతరం పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ సీఈవో పాదం భూమేష్, బ్యాంక్ సిబ్బంది శ్రావణ్ , రంజిత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.