Godavarikhani | కోల్ సిటీ , మే 25: గోదావరిఖని కాకతీయ నగర్ కు చెందిన పాషా అనే నిరుపేద కుటుంబంకు భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. పాషా భార్య కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఇటీవల అకాల మృతి చెందింది. అతడి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న గోదావరిఖనికి చెందిన లతా రాంమ్మోహన్లు తమ వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని భరోసా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు నసీమా చేతుల మీదుగా రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు.
పెళ్లి రోజున ఆడంబరాలకు ఖర్చు చేయకుండా కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబంకు సాయం అందించడం పట్ల రాంమ్మోహన్ దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎండీ ముస్తఫా, గట్ల రమేష్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు బొల్లం మధుబాబు తదితులు పాల్గొన్నారు.