25 లక్షలు ఇస్తవా.. లేదా?
‘25 లక్షలు ఇవ్వు. లేకుంటే నీవు అవినీతి అక్రమాలు చేసినట్టు ఫైల్ తయారు చేస్తం. ముఖ్యమంత్రికి పంపిస్తం’ అంటూ ఓ అధికారిని నలుగురు వ్యక్తులు బెదిరించారు.
- లేకుంటే అవినీతి చేసినట్టు సీఎంకు ఫైల్ పంపుతం
- ఓ అధికారికి నలుగురి బెదిరింపు
- ముగ్గురిని రిమాండ్ చేసిన పోలీసులు
ఇల్లందకుంట, జనవరి 9: ‘25 లక్షలు ఇవ్వు. లేకుంటే నీవు అవినీతి అక్రమాలు చేసినట్టు ఫైల్ తయారు చేస్తం. ముఖ్యమంత్రికి పంపిస్తం’ అంటూ ఓ అధికారిని నలుగురు వ్యక్తులు బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారులో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. ఇల్లందకుంట ఎస్ఐ రాజ్‌కుమార్ వివరాల ప్రకారం.. మండలంలోని పాతర్లపల్లి గ్రామానికి చెందిన అబ్బిడి సురేందర్‌రెడ్డి, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మొగలపల్లి మండలం గుండ్లకర్తి గ్రామానికి చెందిన రియాజ్, కుమారస్వామి, సురేశ్ స్నేహితులు. వీరంతా కలిసి హైదరాబాద్‌లోని ఓ అధికారికి ఈ నెల 4, 5 తేదీల్లో ఫోన్ చేసి 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఫైల్ తయారు చేసి, సీఎంకు పంపిస్తామంటూ బెదిరించారు. దీంతో సదరు అధికారి ఈ నెల 6న ఇల్లందకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా దర్యాఫ్తు చేసి, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ కేసులో మరో నిందితుడు సురేశ్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

