Gattududdenapalli school | మానకొండూరు రూరల్, నవంబర్ 3 : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని గట్టుదుద్దెనపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లేసరికి ఫెన్సింగ్ వేసి ఉంది. పాఠశాలకు వెళ్లే దారి రాత్రికి రాత్రే ఎవరో కంచె వేయడంతో విద్యార్థులు లోపలికి వెళ్లే వీలు లేకుండా పోయింది. దారిలేక విద్యార్థులు రోడ్డుపైనే నిలబడిన పరిస్థితి నెలకొంది.
ఈ విషయంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఉన్న దారి ఒక్కసారిగా ఎందుకు మూసివేశారు.? భూవివాదమా, లేక రాజకీయ కోణమా.? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలకే దారి లేకపోవడం ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి స్కూల్ కు దారి ఎలావుండాలి. పట్టాదారుల భూమి అయితే ఇన్ని రోజులు ఇలా నడవనిచ్చారు. స్కూల్ ఇంత దయానియ స్థితిలో నడిసిందా.? పట్టాదారులతో మాట్లాడి ఫెన్సింగ్ తొలగించి, పాఠశాలకు శాశ్వత దారి కల్పించాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.