కోరుట్ల రూరల్, జూన్ 17 : రెండేళ్ల నుంచి నడుస్తున్న ఆస్తి తగాదాలు చివరకు నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. తండ్రి, తమ్ముడితోపాటు మరికొందరు కుటుంబ సభ్యుల దాడిలో పెద్ద కొడుకు ప్రాణాలు గాల్లో కలిశాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కోరుట్ల మండలంలోని మోహన్‌రావుపేటకు చెందిన కోట గంగరాజానికి రాజేశ్ (35), రాకేశ్ ఇద్దరు కొడుకులు. వీరి మధ్య రెండేళ్లుగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి 9గంటల తర్వాత కు డా గొడవ జరిగింది.
ఈ క్రమంలో రాజేశ్‌పై తండ్రి, త మ్ముడుతోపాటు మరికొందరు కుటుంబ సభ్యులు, రాకేశ్ స్నేహితులు రాజేశం, నరేశ్ పదునైన ఆయుధాలతో దాడి చేశారు. తీవ్రగాయాలైన రాజేశ్‌ను కోరుట్ల ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. రాజేశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్య లో మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని సీఐ సురేశ్‌బాబు, ఎస్ఐ కిరణ్‌కుమార్ పరిశీలించారు. రాజేశ్‌కు భార్య లా స్య, కొడుకు, కూతురు ఉన్నారు. లాస్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.